విచ్చలవిడిగా గంజాయి స్మగ్లింగ్.. పోలీసుల హెచ్చరిక

-

తెలంగాణలో విచ్చలవిడిగా డ్రగ్స్ కల్చర్ పెరిగిపోతోంది. రాజధాని హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాలకు సైతం ఈ డ్రగ్స్ మహమ్మారిచ పాకింది.ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు.ముఖ్యంగా నగరంలో వీకెండ్స్‌లో పబ్బుల్లో,ఇతర పార్టీల్లో తడవుగా సోదాలు నిర్వహించి.. డ్రగ్స్ దొరికితే కటకటాల వెనక్కి పంపుతున్నారు. హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి వరంగల్‌లోనూ గంజాయి స్మగ్లింగ్‌పై పోలీసులు ఎక్కువగా దృష్టిపెట్టారు.

గత ఏడాదిలో రూ.4.14 కోట్ల విలువైన 20 క్వింటాళ్ల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. మొత్తంగా 103 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకూ రూ.4.12 కోట్ల విలువైన 13 క్వింటాళ్ల గంజాయిని సీజ్ చేసి..157 కేసులు నమోదు చేశారు. వీటిలో అధికంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్,మహబూబాబాద్ జిల్లాల్లోనే నమోదయ్యాయని ఉమ్మడి వరంగల్ పోలీసులు వెల్లడించారు. ఆంధ్రా- ఒడిశా బోర్డర్ నుంచి రోడ్డు, రైలు మార్గాల్లో వరంగల్‌కు గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.ఇకపై ఎవరైనా స్మగ్లింగ్ చేసినా, మత్తుపదార్థాలు సేవిస్తూ పట్టుబడిన కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ సీపీ అంబర్ కిషోర్ హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news