మహాత్ముడికి సీఎం రేవంత్ రెడ్డి నివాళి!

-

మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం లంగర్ హౌజ్‌లోని బాపూఘాట్‌లో ఘనంగా నివాళులు అర్పించారు.గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.సీఎం రేవంత్‌తో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, నగర కమిషనర్ సీవీ ఆనంద్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, వి.హనుమంతరావు, గుత్తా సుఖేందర్ రెడ్డి,కే కేశవరావు తదితరులు బాపూఘాట్ వద్ద నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.

ఈ సందర్బంగా సీఎ రేవంత్ మాట్లాడుతూ.. గాంధీ దేశానికి అందించిన సేవలు, స్వాతంత్ర్యం కోసం పోరాడిన తీరును గుర్తు చేసుకున్నారు.అనంతరం బాపూఘాట్‌లో గాంధీని స్మరిస్తూ ఏర్పాటు చేసిన కచేరీని సీఎం రేవంత్ తిలకించారు.బాపూఘాట్‌కు వచ్చిన విద్యార్థులను కలిసి కరచాలనం చేశారు. బాగా చదువుకుని, రేపటి పౌరులుగా దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని ముఖ్యమంత్రి సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news