మూసీ సుందరీకరణ ఓకే..మంజీరా సంగతేంటి? : హరీశ్ రావు

-

మూసీ సుందరీకరణ ఓకే..కానీ,సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఫార్మా సిటీ ఏర్పాటు చేసి మంజీరాను ఏం చేయాలనుకుంటున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు.గురువారం ఫార్మాసిటీ ఏర్పాటుతో పంట పొలాలను కోల్పోతున్న రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. జహీరాబాద్‌‌లో ఫార్మా సిటీని నెలకొల్పితే అనేక సమస్యలు వస్తాయన్నారు. దాని నుంచి వచ్చే వ్యర్థ జలాలు చుట్టుపక్కల ప్రాంతాల్లోని నక్కవాగు, చాకలి వాగు, కోట వాగు,న్యాల్‌కల్ వాగుల్లో కలుస్తాయన్నారు.చివరగా అవి పెద్ద వాగు ద్వారా మంజీరాలో కలుస్తాయన్నారు.

దీంతో పంట పొలాలు, మంజీరా కలుషితం అవుతుందన్నారు. మంజీరా జలాలను మెదక్,హైదరాబాద్ జిల్లాల ప్రజలు తాగుతున్నారని..ఇప్పుడు వాటిని విషంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ఫార్మా భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమన్నారు.భూ నిర్వాసితులు అధైర్యపడొద్దని,ఎలాంటి అఘాయిత్యాలు చేసుకోవద్దని హరీశ్ రావు సూచించారు.నిరుపేదల పక్షాన బీఆర్ఎస్ నిలబడి కొట్లాడుతుందని హామీ ఇచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Latest news