కొండా సురేఖవి చౌకబారు వ్యాఖ్యలు..మహేష్‌ బాబు ట్వీట్‌

-

కొండా సురేఖవి చౌకబారు వ్యాఖ్యలు అంటూ టాలీవుడ్‌ హీరో మహేష్‌ బాబు ట్వీట్‌ చేశారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ గారు మా సినీ ప్రముఖులపై చేసిన వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయని తెలిపారు. ఒక కూతురి తండ్రిగా, భార్యకు భర్తగా, తల్లికి కొడుకుగా.. ఓ మహిళా మంత్రి మరో మహిళపై చేసిన ఆమోదయోగ్యంకాని వ్యాఖ్యలు, భాష పట్ల తీవ్ర వేదనకు గురయ్యాను.

ఎదుటివారి మనోభావాలను దెబ్బతీయనంత వరకు వాక్‌స్వేచ్ఛను ఉపయోగించుకోవచ్చు అంటూ వ్యాఖ్యానించారు. నేను చేసిన చౌకబారు మరియు నిరాధారమైన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను మరియు సినీ వర్గాన్ని సాఫ్ట్ టార్గెట్‌గా మార్చుకోవద్దని పబ్లిక్ డొమైన్‌లోని వ్యక్తులను అభ్యర్థిస్తున్నానని కోరారు. మన దేశంలోని మహిళలను మరియు మన సినీ సోదరులను చాలా గౌరవంగా చూడాలని మహేష్‌ బాబు కోరారు.

 

Read more RELATED
Recommended to you

Latest news