1960లో జరిగిన ఒక కథనే ‘మట్కా’ చిత్రం : వరుణ్ తేజ్

-

విజయవాడ నగరంలో హీరో వరుణ్ తేజ్ సందడి చేశారు.  వరుణ్ తేజ్ నటించిన మట్కా చిత్రం టీజర్ ను  రాజ్ యువరాజ్ థియేటర్ లో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. మట్కా చిత్రం ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుంది. 1960 వ సంవత్సరంలో జరిగిన ఒక కధే మాట్కా చిత్రం అన్నారు. విజయవాడ నగరంలో మట్కా చక్రం టీజర్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది.

దుర్గమ్మ దీవెనలతో ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. నవంబర్ 14న మట్కా చిత్రం రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో సరికొత్త లుక్కుతో ప్రేక్షకులకు కనబడతాను. మట్కా చిత్రాన్ని తెలుగు ప్రజలు ఆదరించాలి. పలాస చిత్ర డైరెక్టర్ కరుణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తంగలాన్ చిత్రానికి కెమెరా మెన్ గా పనిచేసిన కిషోర్ కుమార్ ఈ చిత్రానికి కెమెరామెన్ గా అద్భుతమైన విజువల్స్ తీశారు.  సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ పాటలు ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తాయని తెలిపారు వరుణ్ తేజ్.

Read more RELATED
Recommended to you

Latest news