జమ్ముకాశ్మీర్‌లో ప్రో ఇండియాదే అధికారం : బీజేపీ

-

జమ్ముకశ్మీర్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. అయితే, శనివారం హర్యానా ఎన్నికలు సైతం ముగియడంతో రెండు రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతున్నదనే విషయాన్ని ఎగ్జిట్ పోల్స్ ముందస్తుగా అంచనా వేశాయి. హర్యానాలో కాంగ్రెస్ కూటమి వస్తుందని అంచనా వేయగా.. జమ్ముకాశ్మీర్‌లోనూ ఇండియా-ఎన్సీ కూటమి రాబోతున్నదని కొన్ని సర్వేలు వెల్లడించాయి.

 

ఇదిలాఉండగా, జమ్ముకాశ్మీర్‌లో బీజేపీ నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి అన్నారు. ఎగ్జిట్ పోల్స్‌పై ఆయన స్పందిస్తూ ‘ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన ఈ ఎన్నికలు చారిత్రాత్మకం. ప్రజాస్వామ్య విజయం. అక్కడి ప్రజలు నేషన్ ఫస్ట్, ప్రో ఇండియా డెవలప్ మెంట్ పార్టీలకే ఓటేశారని రిపోర్టులు అందినట్లు పేర్కొన్నారు. హరియాణాలోనూ బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news