ఆంధ్ర యూనివర్శిటీలో ర్యాగింగ్ రక్కసి..డ్యాన్సులు చేయాలంటూ !

-

 

Andhra University : ఆంధ్ర యూనివర్శిటీలో ర్యాగింగ్ రక్కసి ఉందని విజయసాయిరెడ్డి పోస్ట్‌ పెట్టారు. ఆంధ్ర యూనివర్శిటీలో కొంతకాలంగా లేని ర్యాగింగ్ రక్కసి మళ్లీ పురుడు పోసుకుని విద్యార్ధినిలు నేరుగా మీడియా ముందుకి బట్టబయలు అయ్యిందని తెలిపారు. హాస్టల్ రూమ్స్ లో అసభ్యకరంగా డ్యాన్సులు చేయాలంటూ ఫస్టియర్‌ విద్యార్థినులపై దురుసుగా ప్రవర్తిస్తూ కొంతమంది సీనియర్లు ఇబ్బంది పెట్టి వీడియోలు తీసి వాట్సాప్‌ గ్రూపుల్లో కూడా పెట్టారని గుర్తు చేశారు సాయిరెడ్డి.

Andhra University suspends 10 students for ragging first-year female students

దీనిపై స్పందించిన కాలేజీ యాజమాన్యం చర్యలు చేపట్టిందని వివరించారు. మాకు డ్యాన్స్‌ రాదని చెబితే.. అబ్బాయిల దగ్గరకు వెళ్లి నేర్చుకుని రమ్మని సీనియర్లు ఇబ్బంది పెట్టారన్నారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా 10 మంది విద్యార్థినులను 15 రోజుల పాటు సస్పెండ్‌ చేసిందని తెలిపారు. బాధిత విద్యార్ధినిల తల్లిదండ్రుల మనోవేదన అర్థం చేసుకోండి. టీడీపీ నాయకుల సుపుత్రులు వున్నట్టుగా తెలుస్తుంది. టీడీపీ ప్రభుత్వం నిద్రపోతుందా? అంటూ చంద్రబాబు పై ఆగ్రహించారు విజయసాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news