మణిపూర్‌లో అల్లర్లు.. భారీగా ఆయుధాలు స్వాధీనం

-

మణిపూర్‌లో అల్లర్లు మరోసారి నెలకొన్న తరుణంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి లభ్యం అయ్యాయి. గత మూడు రోజులుగా మణిపూర్‌లోని వివిధ ప్రాంతాల్లో భద్రతా బలగాలు, పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే భారీగా ఆయుధాలను సీజ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇంఫాల్ తూర్పు జిల్లాలోని చంపాయ్ కొండ వద్ద చేసిన సోదాల్లో ఒక ఎం-16 రైఫిల్, 22 రైఫిల్స్, రెండు ఎస్ఎల్ఆర్‌లు, ఒక దేశీయ స్టెన్ గన్, రెండు కార్బైన్లు, ఎనిమిది దేశీయ పిస్టల్స్, 12 రెండు అంగుళాల మోర్టార్లను గుర్తించారు.

లువాంగ్‌ షాంగ్‌ బామ్ ప్రాంతంలో 32 పిస్టల్స్, 9 ఎంఎం పిస్టల్, రెండు హ్యాండ్ గ్రెనేడ్‌లు, మోర్టార్‌లు దొరికాయి. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని ఖేలాఖోంగ్‌, బిష్ణుపూర్ జిల్లాలోని గెల్‌బంగ్ గ్రామంలోనూ అనేక పరికరాలను గుర్తించి సీజ్ చేశారు. చురచంద్‌పూర్‌లోని కంగ్‌వై వద్ద జరిగిన దాడిలో రెండు అధునాతన మోర్టార్‌లు, స్థానికంగా తయారు చేసిన రెండు హ్యాండ్ గ్రెనేడ్‌లు, మరో రెండు దేశీయ పిస్టల్‌లను స్వాధీనం చేసుకున్నట్టు భద్రతా బలగాలు వెల్లడించాయి.కాగా, గత ఏడాదిన్నర కాలంలో మణిపూర్‌లో కుకీ, మైతీ వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news