ఏపీకి తుఫాను ముప్పు… నాలుగు రోజులు పాటు వర్షాలు

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు రెడ్‌ అలర్ట్‌. బంగాళాఖాతంలో తుఫాను ముప్పు దారుణంగా పొంచి ఉంది. దానా తుఫాను ముప్పు పొంచి ఉండడంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు ఐఎండి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. వాయుగుండం ఈరోజు తుఫానుగా మారి రేపు తీవ్ర తుఫానుగా బలపడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.

Cyclone threat for AP Rains for four days

ఒడిశా, బెంగాల్ వద్ద తీరం దాటే అవకాశాలు ఉన్నాయని భావిస్తోంది. దీని ప్రభావంతో VZM, మన్యం, శ్రీకాకుళం జిల్లాలో భారీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇటు రుతుపవనాల ప్రభావంతో రాయలసీమలో మరో నాలుగు రోజులు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక అటు తెలంగాణ రాష్ట్రానికి కూడా వర్షాలు కూడా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news