ఏక్‌ పోలీస్‌ విధానం కావాలి.. రోడ్డెక్కిన పోలీసుల భార్యలు!

-

రాష్ట్రంలో పోలీసుల భార్యలు గురువారం నిరసన బాట పట్టారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 17వ బెటాలియన్ ఎదుట పోలీసుల భార్యలు రోడ్డెక్కి ధర్నా చేపట్టారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో ఆ మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ భర్తలు పోలీసులు అయినా.. వారి డ్యూటీకి చేస్తున్న పనికి అసలు సంబంధం లేదని ఆరోపించారు. తెలంగాణలో ఒకే పోలీసు విధానం ఉండాలని వారు డిమాండ్ చేశారు.

తెలంగాణ ప్రభుత్వం శాంతి భద్రతలు కాపాడే పోలీస్‌ వ్యవస్థలో ఏక్‌ పోలీస్‌ విధానాన్ని అనుసరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.శాంతి భద్రతల కోసం రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ కానిస్టేబుళ్లు వెట్టిచాకిరీ చేస్తున్నా..వారి కుటుంబాల ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. విధి నిర్వహణ పేరుతో తమ భర్తలను కుటుంబాలకు దూరం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కాగా, రాష్ట్రంలో ఒకే పోలీస్‌ విధానం ఉండాలనే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు,నిరసనలు చేపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news