హైదరాబాద్ వచ్చే విస్తారా ఫ్లైట్‌కు బాంబు బెదిరింపు..ఎమర్జెన్సీ ల్యాండింగ్!

-

ఇటీవలి కాలంలో ఎయిర్ పోర్టులు, విమానాలు, రైల్వేస్టేషన్లకు బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్ వస్తున్న విస్తారా విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో జైపూర్‌లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. వరుసగా బాంబు బెదిరింపులు వస్తుండటంతో విమానాల్లో తరుచూ ప్రయాణించే ప్యాసింజర్స్ భయాందోళనకు గురవుతున్నారు.

ఈ క్రమంలోనే శుక్రవారం కూడా మరో విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన విస్తారా విమానం పైలట్ జైపూర్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. ఆ తర్వాత ప్రయాణికులను విమానం నుంచి కిందకు దింపేశారు. అనంతరం బాంబ్ స్క్వాడ్‌‌కు సమాచారమిచ్చారు. వారొచ్చి విమానంలో తనిఖీలు నిర్వహించగా.. విమానంలో ఏమీ దొరకలేదు. దీంతో అది ఫేక్ కాల్ అయి ఉండొచ్చని సెక్యూరిటీ సిబ్బంది, అధికారులు అనుమానం వ్యక్తంచేశారు. ఎయిర్ పోర్టు అథారిటీ క్లియరెన్స్ ఇవ్వడంతో విస్తారా విమానం హైదరాబాద్‌‌కు బయలుదేరనుంది.

Read more RELATED
Recommended to you

Latest news