ఈనెల 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

-

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 25 నుండి ప్రారంభమైన పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 21 తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశాలలో కేంద్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది.

వన్ నేషన్, వన్ ఎలక్షన్ కి కేంద్రం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పార్లమెంటు శీతాకాల సమావేశాలలో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందాలంటే రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

ఈ సవరణలకు లోక్ సభలోని 543 స్థానాల్లో కనీసం 67% మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలి. అటు రాజ్యసభలో 245 సీట్లలో 67% ఈ బిల్లును సమర్థించాల్సి ఉంటుంది. దీనికి అదనంగా దేశంలో ఉన్న రాష్ట్రాల్లో కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లుకు ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ముగియాగానే ఈ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news