ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

-

ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు పై కీలక ప్రకటన చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లబ్ధిదారుల ఎంపిక వేగవంతం చేశామని అన్నారు. మొత్తం నాలుగు దశల్లో ఇళ్లు కేటాయిస్తామన్నారు పొంగులేటి. మొదటి దశలో నియోజకవర్గానికి 3500 ఇల్లు ఇస్తామని తెలిపారు.

ఈ నెలాఖరులోగా లబ్ధిదారుల వివరాలను ప్రకటిస్తామని అన్నారు. 400 చదరపు అడుగులలో ఇంటి నిర్మాణం ఉంటుందని పేర్కొన్నారు. సొంత స్థలం ఉన్న వారికి రూ. 5 లక్షలు దశలవారీగా ఇస్తామని తెలిపారు పొంగులేటి. ఇంటి యజమానిగా మహిళనే గుర్తిస్తామని వెల్లడించారు. పేదవారికి ఇందిరమ్మ ఇళ్ళను నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి తెలిపారు.

దీనిని దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగం పనిచేయాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు అధికారుల హయాంలో జరుగుతోందని.. ఇందులో ఎలాంటి రాజకీయం, రాజకీయ వర్గాలకు తావు లేకుండా, ఏ పార్టీలకు అతీతంగా సంబంధం లేకుండా ప్రతి ఒక్క అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలను ఇవ్వడం జరుగుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news