దేశవ్యాప్తంగా ఎయిరోపోర్టులు, రైల్వేస్టేషన్లతో పాటు పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులకు ఇటీవలి కాలంలో వరుస బెదిరింపుకాల్స్ వస్తున్న విషయం తెలిసిందే.మొన్నటివరకు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు బెదిరింపు కాల్స్ రాగా.. తాజాగా ఓ గుర్తు తెలియని దుండగుడు ఏకంగా యూపీ సీఎం యోగిని చంపేస్తానని బెదిరింపు కాల్ చేసినట్లు తెలుస్తోంది.
‘యోగి ఆదిత్యనాథ్ 10 రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేయాలి. లేకపోతే ఎన్సీపీ లీడర్ బాబా సిద్ధిఖీని చంపినట్లే చంపేస్తామని’ ఆ మెసేజ్‌లో పేర్కొన్నారు.శనివారం సాయంత్రం ముంబై పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ సెల్‌కు పేరులేని నెంబర్‌తో ఈ మెసేజ్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఆ మెసేజ్ ఎవరు పంపారు? ఎక్కడి నుంచి వచ్చింది? అనే విషయంపై అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.