తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నాలుగు లక్షలకు పైగా యువ ఓటర్లు ఓటు హక్కును నమోదు చేసుకున్నారని చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది మొత్తంగా 8 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదు కావడంతో ఓటర్ల సంఖ్య 3,34,26,323కు చేరినట్లు వెల్లడించారు. ఇందులో యువఓటర్లు 4,78,838 మంది ఉన్నట్లు తెలిపారు. ఓటర్ల నమోదు కోసం ఈనెల 9,10వ తేదీన మరోసారి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు బూత్ లెవెల్ ఆఫీసర్లు అందుబాటులో ఉన్నారని సీఈవో సుదర్శన్ రెడ్డి వివరించారు. రాష్ట్రంలో కొత్తగా 18 ఏళ్లు పూర్తి చేసుకున్న యువత ఓటు హక్కు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలని సీఈవో సూచించారు.