వికిపీడియాకు కేంద్రం నోటీసులు.. ఆ సమాచారంపై సీరియస్

-

అన్ని రకాల సమాచారాలను వివరంగా అందించే వికీపీడియాకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు వికీపీడియా యాజమాన్యానికి ఓ లేఖను కూడా రాసింది. వికిపీడియా వెబ్‌సైట్‌లో పక్షపాత సమాచారం ఉంటోందని, కొంత తప్పుడు సమాచారాలు సైతం ఉన్నాయని లేఖ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసింది. వికిపీడియాలోని సమాచారాన్ని ఎవరుపడితే వాళ్లు ఎడిట్ చేసే ఆప్షన్ ఉండటంతో కొందరు తమకు ఇష్టం వచ్చినట్లు సమాచారాన్ని మారుస్తున్నారు.

దీనిని కేంద్రం ప్రధానంగా తప్పు బట్టింది. వికిపీడియా కేవలం మీడియేటర్‌గా కాకుండా తప్పొప్పులను సరిచూడడంపై ఎందుకు ఫోకస్ పెట్టడం లేదని ప్రశ్నించింది. కాగా, వికిపీడియాపై న్యూస్ ఏజెన్సీ ANI ఇటీవల కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తమ సంస్థ పరువుకు భంగం కలిగించేలా వికీపీడియా వ్యవహరించిందంటూ ఢిల్లీ హైకోర్టులో పరువునష్టం దావా వేసింది.దీంతో కోర్టు సైతం వికిపీడియా యాజమాన్యానికి చీవాట్లు పెట్టింది .

Read more RELATED
Recommended to you

Latest news