మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఏపీ పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఆయన కూనుపూరు కాలువ పరిశీలనకు వెళ్తారని సమాచారం రావడంతో ముందస్తుగా హౌస్ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. కాకాని హౌస్ అరెస్టుతో నెల్లూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన ఇంటి వద్ధ భారీగా పోలీసులు మోహరించారు.దీంతో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి.
నెల్లూరు సంగెం ఆనకట్ట వద్ధ టీడీపీ, వైసీపీ శ్రేణులు బల ప్రదర్శనకు దిగాయి.ఈ క్రమంలోనే కాకాని కూనుపూరు కాలువ కట్ట పరిశీలనకు వస్తే పెద్ద ఎత్తున గొడవ జరిగే పరిస్థితులు ఉన్నందున శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు ఆయన్ను హౌస్ అరెస్టు చేశారు.ఇదిలాఉండగా, కూటమి ప్రభుత్వ విధానాలపై కాకాని తరుచుగా విమర్శలు చేస్తున్నారు. ఇసుక, మద్యం మాఫియాను కూటమి ఎమ్మెల్యేలే నడిపిస్తున్నారని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సీఎం చంద్రబాబుకు దమ్ముంటే వారి ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ కాకాని సవాల్ విసిరిన విషయం తెలిసిందే.