రెండు తెలుగు రాష్ట్రాల్లోని పట్టభద్రులకు అలర్ఠ్. పట్టభద్రుల “MLC” ఓటు నమోదుకు ఇవాళే ఆఖరి రోజు. 2021 లోపు ఎవరైతే.. డిగ్రీ పాస్ అయి ఉంటే…వాళ్లు ఈ పట్టభద్రుల “MLC” ఓటు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పట్టభద్రుల “MLC” ఓటు నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పట్టభద్రుల “MLC” ఎన్నిక రానుంది.
అటు ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల “MLC” ఎన్నిక కూడా రానుంది. అయితే.. ఈ పట్టభద్రుల “MLC” ఓటు నమోదుకు నేడు ఆఖరి రోజు. అర్హులు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. మొబైల్ ఫోన్ లో కూడా పట్టభద్రుల “MLC” ఓటు నమోదు చేసుకోవచ్చును. ఎన్నికల సంఘం వెబ్‌సైట్ కు ( https://ceotelangana.nic.in/) వెళ్లి… పట్టభద్రుల “MLC” ఓటు నమోదు చేసుకోవాలి.
పట్టభద్రుల “MLC” ఓటు నమోదు కు కావలసిన పత్రాలు
1.డిగ్రీ ప్రొవిజినల్ సర్టిఫికెట్
2. ఆధార్ కార్డు
3. ఫోటో
4. ఫోన్ నంబర్
5. ఓటరు గుర్తింపు కార్డు