ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ సిలిండర్ ని ఉపయోగిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ ని గమనించినట్లయితే కొన్ని అక్షరాలు రాసి ఉంటాయి. గ్యాస్ సిలిండర్ పై భాగంలో ప్రత్యేకమైన ఒక కోడ్ ఉంటుంది. కొన్ని అక్షరాలతో పాటుగా కొన్ని సంఖ్యలు కూడా ఉంటాయి. సిలిండర్ మీద రాసిన ఆంగ్ల అక్షరాలు ఏ,బి,సి,డి లు నెలల్ని సూచిస్తాయి. సిలిండర్ ఎంత కాలం చెల్లుబాటు అవుతుంది అనేది సంఖ్య చెప్తుంది.
ఏ అని ఉన్నట్లయితే జనవరి, ఫిబ్రవరి, మర్చి. అదే బి ఉంటే ఏప్రిల్, మే, జూన్. సి అని సిలెండర్ పై ఉన్నట్లయితే జూలై, ఆగస్టు, సెప్టెంబర్. డి అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు. ఒకవేళ మీ సిలిండర్ పై B24 అని రాసి ఉన్నట్లయితే సిలిండర్ ఏప్రిల్, మే, జూన్ నెల తో ముగిసిపోతుందని.
23 అంటే సంవత్సరం 2023 అని అర్థం వస్తుంది. గడువు తేదీ తర్వాత కూడా సిలిండర్ ని ఉపయోగించడం మంచిది కాదు అది ప్రమాదకరం. సిలిండర్ పేలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు మీ సిలెండర్ పై కోడ్ చెక్ చేసుకుని ఉపయోగించడం మంచిది.