3వ రోజు అసెంబ్లీ సమావేశాలు…నేడు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక !

-

ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. 3వ రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ముందుగా ప్రశ్నోత్తరాలు ఉంటాయి. బి.సి. జనార్దన్ రెడ్డి – టేబుల్ ఐటెమ్ – 2020-21 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ 16వ వార్షిక నివేదిక ఉంటుంది. కింజరాపు అచ్చన్నాయుడు, టేబుల్ ఐటెమ్ – 2022-23 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ యొక్క 46వ వార్షిక నివేదిక ఉండనుంది. మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ గా రఘురామను ఏకగ్రీవంగా ప్రకటించనున్నారు.

ap assembly

ప్రభుత్వ బిల్లులు:

1. DR. ఎన్.టి.ఆర్. యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (సవరణ) బిల్లు, 2024.

2. ఆంధ్ర ప్రదేశ్ ఆయుర్వేద మరియు హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టీషనర్స్ (సవరణ) బిల్లు, 2024.
ఆంధ్రప్రదేశ్ ఆయుర్వేద మరియు హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ (సవరణ) బిల్లు, 2024

3. ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ రిజిస్ట్రేషన్ (సవరణ) బిల్లు, 2024.

4. ఆంధ్ర ప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ (నిషేధం) బిల్లు, 2024.

5. ఆంధ్ర ప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ (రెండవ సవరణ) బిల్లు, 2024

Read more RELATED
Recommended to you

Latest news