తెలంగాణ ప్రభుత్వం శాంతి భద్రతల కోసం పోలీస్ బందోబస్తును కఠినతరం చేయడంతో రాత్రి 11 తర్వాత రోడ్డు మీద గుంపులుగా కనిపిస్తే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. కొందరు ఆకతాయిల ఆట కట్టిస్తుంటే మరికొందరు పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్‌లోని కొందరు షాపుల నిర్వహకులు ఆలస్యంగా క్లోజ్ చేస్తుండటంపై పోలీసులు సీరియస్ అవుతున్నారు.
ఈ క్రమంలోనే సమయపాలన పాటించడం లేదంటూ పాన్ షాప్ నిర్వాహకుడని గస్తీ పోలీసులు లాఠీలతో చితకబాదారు. ఆ దెబ్బలకు పాన్‌షాప్ నిర్వాహకుడు మెహ్రాజ్ కాలుకు తీవ్ర గాయం అయినట్లు తెలుస్తోంది. దీంతో అతన్ని వెంటనే అమీర్‌పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.