గస్తీలో ఉన్న పోలీసులపై అర్ధరాత్రి గంజాయి గ్యాంగ్ దాడికి పాల్పడింది. బీర్ బాటిళ్లతో దాడి చేయడంతో ఎస్పై తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబద్ నగరంలోని హబీబ్ నగర్ పీఎస్ పరిధిలో బుధవారం ఉదయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంలో ఇద్దరు నార్కోటిక్ అధికారులు స్థానిక ఎస్ఐ శివకుమార్‌తో పాటు కొందరు కానిస్టేబుళ్లను తీసుకుని హబీబ్ నగర్‌లోని మాంగర్ బస్తీకి చేరుకున్నారు.
పోలీసుల రాకను ముందే గమనించిన పాత నేరస్తుడు, గంజాయి వ్యాపారి కంబ్లీ దీపక్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు వెంటపడగా.. అతడి సోదరుడు అరుణ్‌తో పాటు దాదాపు 100 మంది స్థానిక బస్తీవాసులు పోలీసులపై దాడికి పాల్పడ్డారు. అందులో ఒకరు ఎస్ఐ తలపై బీర్ బాటిల్‌తో కొట్టగా గాయాలపాలైన ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.