వైసీపీ నేత, స్పోర్ట్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టులో భారీ ఊరట లభించింది. సాయి ఈశ్వర్ అనే వ్యక్తి మర్డర్ కేసులో బైరెడ్డి ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.ఈ కేసు విచారణలో భాగంగా ధర్మాసనం ఈ కేసును కొట్టి వేసింది. బైరెడ్డి సిద్ధార్థతో పాటు మరో 9 మందిని నిర్దోషులుగా న్యాయస్థానం ప్రకటించింది.
కాగా,నందికొట్కూరు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ సాయి ఈశ్వర్ 2014లో దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే.కర్నూలు త్రి టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ కేసులో మొదటి నిందితుడు చికెన్ బాషా కాగా, ఐదో నిందితుడిగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పేరును పోలీసులు చేర్చారు. బైరెడ్డితో పాటు ఆయన అనుచరులపైనా కేసులు నమోదు చేశారు.ఈ కేసులో తుది వాదనలు విన్న విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు బుధవారం తాజాగా తీర్పు వెలువరించింది.దీంతో సిద్ధార్థ రెడ్డి భారీ ఊరట లభించింది.