ఈ మధ్య కాలంలో మొబైల్ వచ్చాక చిన్న పిల్లలు సైతం మొబైల్ కి అలవాటు పడి చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారు. పల్లెటూర్లలో కూడా మైనర్లు రెచ్చిపోతున్నారు. తల్లిదండ్రుల పై సైతం దాడులకు వెనుకాడటం లేదు. ఇదేమిటని పలువురు ప్రశ్నిస్తే.. వారిపై కూడా దాడులు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం చోటు చేసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని ఐమాక్స్ వద్ద ఓ న్యాయవాది పై దాడి చేసిన ఇద్దరు మైనర్ లు అరెస్ట్ అయ్యారు.
న్యాయవాదిపై దాడి చేసి ఫోను ను ఎత్తుకొని పోయిన మైనర్ బాలురు. కత్తి తో బెదిరించి మొబైల్ ఫోన్లు ఎత్తుకెళ్లారు ఇద్దరు మైనర్లు. ముందుగా అబిడ్స్ గన్ ఫౌండ్రిలోని వాచ్ మెన్‌ను కత్తి తో బెదిరించి మొబైల్ ను ఎత్తుకెళ్లారు. ఆ తరువాత న్యాయవాది కళ్యాణ్ పై దాడి చేశారు. న్యాయవాది వద్ద ఉన్న ఫోన్ కోసం కత్తి తో బెదిరించారు మైనర్లు. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రెండు చోట్ల సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి.