గన్‌తో చంపుతానని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ బెదిరింపులు..!

-

కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గన్ తో  చంపుతానని బెదిరింపులకు పాల్పడుతున్నట్టు ఓ రైతు, అతని కుటుంబ సభ్యులు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా వారికి సంబంధించిన వీడియో  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ దొర మమ్మల్ని టార్చర్ పెడుతున్నాడని..  ఆయన నుంచి మాకు ప్రాణహాని ఉందన్నారు.  జగిత్యాల జిల్లా మాల్యాల మండలం మానాల గ్రామంలో 30 ఏండ్ల కింద బల్మురి వెంకట్ తండ్రి మదన్ మోహన్ రావు  దగ్గర 3 ఎకరాల 30 గంటల భూమిని డబ్బులు పెట్టి కొన్నాడు కర్కల నర్సయ్య. అయితే  మా భూమిని మాకు పట్టా రిజిస్ట్రేషన్ చెయ్యమంటే  రౌడీలను, గుండాలను తీసుకొచ్చి బల్మురి వెంకట్ గన్ తీసుకొని మమల్ని బెదిరిస్తున్నాడు.

ఇన్నిరోజులు వాళ్ళకి భయపడి మేము మీడియా ముందుకు రాలేదు.  ఇప్పుడు మేము చనిపోయినా పర్వాలేదు.  కానీ మా భూమి మాకు రిజిస్ట్రేషన్ కావాలి.  2 ఎకరాల్లో మాతో బంగళా కట్టించుకున్నారు.  మేము ఈ భూమి మీదే ఆధారపడి బతుకున్నం.  వెంకట్ దొర తల్లి బల్మురి పద్మ మమ్మల్ని ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టింది.  భూమి రిజిస్ట్రేషన్ చేయం ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోండి అంటుందని నర్సయ్య కూతురు మీడియాతో మాట్లాడింది.

 

Read more RELATED
Recommended to you

Latest news