‘ఇస్కాన్’ ఓ టెర్రరిస్టు సంస్థ.. ‘రా’ కోసం పనిచేస్తోంది : బంగ్లా తాత్కాలిక ప్రధాని

-

ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన ‘ఇస్కాన్’‌ కృష్ణ భక్తుల సమూహాన్ని టెర్రరిస్టు సంస్థగా బంగ్లాదేశ్ పోలీసులు అభివర్ణించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. మాజీ ప్రధాని షేక్ హసీనాను బంగ్లాదేశ్ నుంచి ఆ దేశ ఆర్మీ, ప్రజలు తిరుగుబాటు చేయడంతో ఆమె ఇండియాకు వచ్చి తలదాచుకున్న విషయం తెలిసిందే. ఆ నాటి నుంచి అక్కడ హిందువులు, ఆలయాలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. దాడులతో పాటు ఆలయాల ధ్వంసం, దోపీడీలు పెరిగిపోయాయి.

 

మహిళలపై దాడులు, పబ్లిక్‌గా వెంటబడి వేధించండం వంటి ఘటనలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా బంగ్లాలో మరోసారి అశాంతి నెలకొంది.తమకు భద్రత కల్పించాలని హిందూ కమ్యూనిటీ ప్రజలు పెద్దఎత్తున అక్కడ ఆందోళనలు చేపట్టగా.. వాటిని అక్కడి పోలీసులు అణిచివేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘జై శ్రీరాం’ అని గట్టిగా చంట్ చేసినందుకు ఇస్కాన్ కమ్యూనిటీని టెర్రరిస్టు సంస్థగా బంగ్లా పోలీసులు ప్రెస్ కాన్ఫరెన్సులో పేర్కొన్నారు. ఇక ఇస్కాన్ ‘రా’ కోసం పనిచేస్తోందని, దానిని బ్యాన్ చేయాలని బంగ్లా తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్ తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news