తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డులకు దారులకు శుభవార్త చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సంక్రాంతి నుంచి రేషన్ కార్డు ఉన్నవారికి సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రకటన చేశారు మంత్రి తుమ్మల. గురుకులాలకు, సంక్షేమ పాఠశాలకు కూడా సన్న బియ్యం ఇస్తామని వెల్లడించారు.
సన్న వడ్లకు రూ. 500 బోనస్ ప్రకటించడం వల్ల.. సన్నవరి సాగు గతంలో 25 లక్షల ఎకరాల్లో ఉండగా, ప్రస్తుతం 40 లక్షల ఎకరాలకు పెరిగింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు.
అలాగే పౌరసరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖ అధికారులతో సమన్వయంతో పనిచేస్తూ రైతులకు కొనుగోళ్ళలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. ఇక ప్రస్తుతం 29.537 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్ధ్యము అందుబాటులో ఉందని, కొనుగోళ్ళకు తగ్గట్లుగా మరింత నిల్వ సామర్ధ్యాన్ని అందుబాటులోకి తెచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు తుమ్మల నాగేశ్వరరావు.