బీజేపీతోనే గిరిజనుల అభివృద్ధి.. రాంచీలో ఈటల ఎన్నికల ప్రచారం!

-

బీజేపీతోనే గిరిజనులు, వెనుకబడిన తరగతుల వారి సమగ్రాభివృద్ధి సాధ్యమని బీజేపీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. గిరిజన పోరాటయోధుడు, స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా జార్ఖండ్ రాంచీ పట్టణంలో ఆయన విగ్రహానికి ఎంపీ ఈటల నివాళులర్పించారు. దేశంలో గిరిజనుల గొప్ప సాంస్కృతిక వారసత్వం, సహకారాన్ని ప్రతిభించేలా ‘జన జాతీయ గౌరవ్ దివస్’ను బిర్సా ముండా జయంతి నాడు ప్రధాని మోడీ సర్కార్ ప్రతిఏటా నిర్వహించడం గర్వకారణమన్నారు.

ఇది గిరిజనుల పట్ల బీజేపీ ప్రభుత్వానికున్న చిత్తశుద్ధి అని కొనియాడారు. వాజ్‌పేయ్ హయాంలో గిరిజన సంక్షేమ శాఖను బీజేపీ ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు.కేంద్రం అత్యంత వెనుకబడిన గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తోందని, ఈ గిరిజన శాఖకు రూ.24 వేల కోట్లను కేటాయించిందన్నారు. గిరిజనుల సామాజిక,ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరచడానికి ఉద్దేశించిన ‘ప్రధాని జన్ జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్‌, పీఎం జన్‌మన్ ధరి ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్‌’ వంటి పథకాలు చేస్తున్నారన్నారు. తెలంగాణలో రూ.900 కోట్లతో సమ్మక్క,సారక్క ములుగు గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తునట్లు ఈటల గుర్తుచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news