కడపలోని పెద్ద దర్గాలో ఉరుసు ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. నవంబర్ 16న ప్రారంభమయ్యే ఈ ఉరుసు ఉత్సవాలు దాదాపు వారం రోజుల పాటు జరుగుతాయి. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వేలాది మంది భక్తులు సూఫీ క్షేత్రా్ని సందర్శిస్తుంటారు. నవంబర్ 16 నుంచి 21వ తేదీ వరకు జరుగనున్నన కడపలోని పెద్ద దర్గా అని పిలువబడే అమీర్ పీర్ దర్గాలో వార్షిక ఉరుసు ఉత్సవాలు సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది.
భక్తులు దర్గాకు ఆధ్యాత్మిక శక్తులున్నాయని నమ్ముతారు. ఇక్కడ ప్రార్థనలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. కడప పెద్ద దర్గా ఉరుసు నేపథ్యంలో రేపు కడపలో అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించారు జిల్లా అధికారులు. పెద్ద దర్గాను ఈ ప్రాంతం ఎంతో పవిత్రమైన స్థలం, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ప్రదేశంగా భావిస్తారు. ఇక్కడికీ చేరుకునే భక్తులు సామాన్య ప్రజలు మాత్రమే కాదు.. పొలిటికల్ లీడర్లు, సినిమా స్టార్లు, క్రీడాకారులు అన్ని రంగాలకు చెందిన వారు దర్గాను సందర్శిస్తారు.