Jhansi Medical College Fire 10 Babies Killed: మెడికల్ కాలేజీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో 10 మంది శిశువుల సజీవ దహనం అయ్యారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ మెడికల్ కాలేజీలోని పీడియాట్రిక్ వార్డులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో ఝాన్సీ మెడికల్ కాలేజీలోని చిన్నారుల వార్డులో హఠాత్తుగా అంటుకున్నాయి మంటలు.
ఈ ప్రమాదంలో 10 మంది శిశువులు సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. దీంతో అత్యవసర తరలింపు ప్రయత్నాలను ప్రారంభించారు అధికారులు. అగ్నిమాపక సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది లోపల చిక్కుకున్న రోగులు, పిల్లలను రక్షించడానికి కిటికీలను పగలగొట్టారు. అగ్నిప్రమాదానికి గత కారణం ఇంకా తెలియనప్పటికీ, ఈ అగ్ని ప్రమాదం కారణంగా కనీసం 10 మంది మరణించగా, చాలా మంది పిల్లలకు గాయాలు అయ్యాయి. దీంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.