కడప జిల్లా పులివెందుల వైసీపీ నేతలకు బిగ్ షాక్ తగిలింది. తాజాగా కడప జిల్లా పులివెందుల లో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.. కడప ఎంపీ అవినాష్ రెడ్డి పి ఏ రాఘవరెడ్డి, వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వివేక్ రెడ్డి, అర్జున్ రెడ్డి ఇళ్లకు నోటీసులు అంటించిన పోలీసులు….ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు.

పలు కేసులలో అనుమనితులుగా ఉన్న రాఘవ రెడ్డి, వివేక్ రెడ్డి, అర్జున్ రెడ్డి…ఇళ్లకు నోటీసులు అంటించారు పోలీసులు. ఇక విచారణకు సహకరించాలని నోటీసులలో పేర్కొన్న పోలీసులు…ఆదేశాలు కూడా ఇచ్చారు. కచ్చితంగా విచారణకు రావాలని లేకపోతే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు.