కేంద్రమంత్రి ఖట్టర్‌ను కేటీఆర్ కలువలేదు : ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి

-

కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలిసినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీకి వెళ్లిన కేటీఆర్.. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలవలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కలిస్తే ఫోటోలు ఉంటాయి కదా? అని ప్రశ్నించారు.

కేంద్రమంత్రి అపాయింట్‌మెంట్ తీసుకున్నారని, కానీ ఆయన్ను బయట నుంచి బయటకే పంపించారన్నారు. కేటీఆర్‌ను ఢిల్లీలో బీజేపీ నేతలు ఒక్కరు కూడా కలవలేదని, అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదన్నారు.ఎందుకంటే నేను కూడా ఖట్టర్ ఆఫీస్ పోయి పీఏతో మాట్లాడిన..ఇటీవలే ఢిల్లీ నుంచి వచ్చానని స్పష్టం చేశారు.తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలోని కొందరు నేతలకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయించాలని ఉందని, కానీ జాతీయ కాంగ్రెస్ నాయకత్వం అరెస్ట్ కాకుండా అడ్డుకుంటుందని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news