ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ ఏసిపి కార్యాలయం కు మాజీ ఎమ్మెల్యే వచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్…విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట విచారణకు హాజరయ్యారు బీఆర్ఎస్ పార్టీ కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. ఫోన్ టాపింగ్ కేసులో విచారణకు రావాలని ఇటీవల జైపాల్ యాదవ్ కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఫోన్ టాపింగ్ కేసులో అరెస్ట్ అయిన నలుగురు నిందితుల సెల్ఫోన్లను విశ్లేషించారు పోలీసులు. వారి సెల్ ఫోన్లలో లభించిన ఫోన్ కాల్ డేటా ఆధారంగా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు నోటీసులిచ్చి విచారణ చేస్తున్నారు జూబ్లీహిల్స్ ఏసిపి. జైపాల్ యాదవ్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు జూబ్లీ సీసీపీ వెంకటగిరి. ఇటీవలే ఫోన్ టాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విచారించి స్టేట్ మెంట్ రికార్డు చేసిన విచారణ అధికారి… ఇప్పుడు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ను విచారణకు పిలిచారు.