నేడు లగచర్లలో జాతీయ ఎస్టీ కమిషన్ బృందం పర్యటించనుంది. ఈ సందర్భంగా గిరిజనులపై దాడిన దాడి వివరాలను తెలుసుకోనుంది జాతీయ ఎస్టీ కమిషన్. లగచర్ల నుంచి సంగారెడ్డి జైలుకు వెళ్లి రైతులతో ముఖాముఖిలో కూడా పాల్గొననుంది జాతీయ ఎస్టీ కమిషన్.
ఎస్సీ, ఎస్టీ , జాతీయ మానవ హక్కుల కమిషన్ కు గిరిజనులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన జాతీయ ఎస్టీ కమిషన్… నేడు లగచర్లలో జాతీయ ఎస్టీ కమిషన్ బృందం పర్యటించనుంది. ఇక అటు ఢిల్లీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లనున్నారు. లగచర్ల ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ , ఎస్సీ, ఎస్టీ కమిషన్ , ఉమెన్ రైట్స్ కమిషన్లకు ఫిర్యాదు చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు.