నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లగచర్ల దారుణాలను జాతీయ మీడియా ముందు చూపించనున్న కేటీఆర్.. కొడంగల్ లగచర్ల బాధితుల కోసం ఢిల్లీకి వెళ్లనున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవితతో కలిసి ఢిల్లీకి వెళ్లనున్నారు కేటిఆర్.
రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి నిరంకుశత్వాన్ని బహిర్గతం చేస్తామంటోన్న బీఆర్ఎస్… ఫార్మా విలేజ్ పేరుతో రేవంత్ సర్కార్ బలవంతపు భూసేకరణ చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపణలు చేయనుంది. గిరిజనులు, దళితులు, ఓబీలపై ప్రభుత్వం దౌర్జన్యం చేస్తోందంటోన్న కేటీఆర్… ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్ లో ప్రెస్మీట్ కూడా పెట్టనున్నారు. ఇక అటు నేడు లగచర్లలో జాతీయ ఎస్టీ కమిషన్ బృందం పర్యటించనుంది. ఈ సందర్భంగా గిరిజనులపై దాడిన దాడి వివరాలను తెలుసుకోనుంది జాతీయ ఎస్టీ కమిషన్. లగచర్ల నుంచి సంగారెడ్డి జైలుకు వెళ్లి రైతులతో ముఖాముఖిలో కూడా పాల్గొననుంది జాతీయ ఎస్టీ కమిషన్.