ఆన్లైన్ బెట్టింగుల బారిన పడి ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. యువత నుంచి సాఫ్ట్వేర్, ప్రభుత్వ ఉద్యోగులు సైతం డబ్బులకు అత్యాశ పడి బెట్టింగులు పెట్టి డబ్బులు పొగొట్టుకోవడమే కాకుండా ఉన్న ఆస్తులు అమ్ముకున్న ఘటనలు సైతం అనేక చూస్తూనే ఉన్నాం. అయితే, బెట్టింగులు పెట్టి డబ్బు సంపాదించాలని కొందరు నిర్వాహకులు వారిని రెచ్చగొడుతున్నారు.
అందుకోసం అమాయకులను నమ్మించేలా కొత్త కొత్త జిమ్మిక్కులు చేస్తున్నారు. తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేస్తూ వారిని బెట్టింగ్ అనే కూపంలోకి లాగుతున్నారు. తమ స్వలాభం కోసం ఎంతో మందిని జూదానికి వ్యసనపరులను చేస్తూ వారి ప్రాణాలను తీస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగులకు పాల్పడ వద్దని సైబర్ క్రైమ్ పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా కొందరు వినిపించుకోవడం లేదు. ముఖ్యంగా నిరుద్యోగ యువత బెట్టింగుల బారిన పడుతున్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో ఇలా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
ప్రాణాలు తీస్తున్న ఆన్ లైన్ బెట్టింగ్‌లు
ఈ మాటలతో అమాయకులను ఆన్ లైన్ బెట్టింగ్ కూపంలోకి లాగుతున్నారు.
తమ స్వలాభం కోసం ఎంతో మందిని జూదానికి వ్యసనపరులను చేస్తూ వారి ప్రాణాలను తీస్తున్నారు. pic.twitter.com/LyAxgDhGZY— ChotaNews (@ChotaNewsTelugu) November 18, 2024