సాధారణంగా ఎక్కడ అయినా పలువురు రాజకీయ నాయకులు ప్రెస్ మీట్ పెడుతుంటారు. వారి ప్రెస్ మీట్స్ కవర్ చేసేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన మీడియా టీమ్ అంతా వస్తుంటుంది. అయితే ఎవ్వరూ కవర్ చేసేది వారు చేస్తుంటారు. కొన్ని పాజిటివ్ గా రాస్తుంటే.. మరికొన్ని నెగిటివ్ గా రాస్తుంటాయి. అది మామూలుగా జరుగుతుండేది. అయితే తాజాగా తెలంగాణలోని గాంధీ భవన్ వద్ద ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.
తాజాగా టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి హల్ చల్ చేశాడు. ప్రధానంగా మిర్రర్ టీవీ నాట్ అలోడ్ అంటూ గాంధీ భవన్ లో హల్ చల్ చేశాడు. మిర్రర్ టీవీ ప్రతినిధి తమకు ఎందుకు లేదు అని ప్రశ్నించాడు. మీకు లేదు.. బయటికి నడవండి.. మిర్రర్ టీవీకి అనుమతి లేదని పేర్కొన్నాడు. మేము వాళ్ల కోసమే వచ్చామని చెబుతుంటే.. చెప్పినప్పటికీ సామ రామ్మోహన్ రెడ్డి వారికి అనుమతి నిరాకరించినట్టు సమాచారం.