నారా రోహిత్‌కు ప్రధాని మోదీ లేఖ.. రామ్మూర్తి నాయుడు మృతికి సంతాపం!

-

తెలుగు నటుడు నారా రోహిత్ తండ్రి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వయాన సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. మొన్న మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన మృతి చెందగా.. సోమవారం అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే రామ్మూర్తి నాయుడు ఇక లేరని విషయం తెలియడంతో భారత ప్రధాని మోడీ నారా రోహిత్‌కు లేఖ రాశారు.

రామ్మూర్తి నాయుడు లేని లేటు పూడ్చలేదని, తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ప్రజలకు అందించిన సేవలను యావత్ ఆంధ్రరాష్ట్రం గుర్తుంచుకుంటుందని పేర్కొన్నారు.ఆయన భౌతికంగా మీకు, మీ కుటుంబసభ్యులకు దూరమైన మీ అందరి హృదయాల్లో కొలువుదీరి ఉంటారన్నారు. రామ్మూర్తి నాయుడు మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలుపుతున్నట్లు ప్రధాని మోడీ లేఖలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news