ఫేస్ బుక్ ప్రేమ ఓ వ్యక్తిని నిండా ముంచింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.1 కోటి 20 లక్షలు పొగొట్టుకునేలా చేసింది. ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజ ప్లాట్ఫాం సంస్థ ఫేస్బుక్లో సంగారెడ్డి జిల్లా పటాన్ చెరుకు చెందిన సాయిలుకు కర్నూలుకు చెందిన ఓ యువతి పరిచయం అయ్యింది. నాటి నుంచి మొహం చూపించకుండా వీరిద్దరూ 10 ఏళ్లు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామని ఒకరినొకరు చెప్పుకున్నారు. ఇలా మాయమాటలు చెప్పి రూ.1కోటి 20 లక్షలను అతని వద్ద నుంచి యువతి విడతల వారీగా తీసుకుంది.
ఐదేళ్ల వరకు పెళ్లిని పోస్టుపోన్ చేయిస్తూ వచ్చిన ఆ యువతి..అప్పటికే వేరే వ్యక్తిని పెళ్లాడింది. అంతటితో ఆగకుండా తనకు కేన్సర్ వచ్చిందని ట్రీట్మెంట్ కోసం డబ్బులు కావాలని అడిగి తీసుకుంది. తీరా మోసపోయానని గ్రహించిన సాయిలు తన డబ్బులు ఇవ్వాలని అడిగితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడింది.దీంతో బాధితుడు పత్తికొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.డబ్బుల లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు పోలీసులకు అందజేశారు.తనకు న్యాయం చేయాలని కోరారు.