Parigi MLA Rammohan Reddys sensational comments: పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లగచర్ల ఘటనలో నిందితుడిగా ఉన్న సురేష్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బండ ప్రకాష్ తో ఫోన్ లో మాట్లాడినట్లు మాకు సమాచారం ఉందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అది మామూలుగా జరిగిన దాడి అయితే కాదని వెల్లడించారు.
పక్కా ప్రణాళిక ప్రకారమే అధికారులపై దాడి జరిగిందని పేర్కొన్నారు. కలెక్టర్ పై దాడి జరుగుతున్నప్పుడే సురేష్ తప్పించుకున్నాడని బాంబ్ పేల్చారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. సురేష్ పరారీలో ఉంటూనే బండా ప్రకాష్ తో ఫోన్ లో మాట్లాడారంటూ పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు కామెంట్స్ చేయడంతో.. బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సురేష్ – బండా ప్రకాష్ తో మాట్లాడిందే నిజమైతే..బీఆర్ఎస్ నేతల ఫోన్లను సర్కార్ ట్యాప్ చేస్తుందా? అనే అనుమానాలు మాకు ఉన్నాయని బీఆర్ఎస్ అంటోంది.