కాంగ్రెస్ హామీలు అమలు చేసినట్టు నిరూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయాల్లో నుండి తప్పుకుంటా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. హామీల చర్చపై రేవంత్ సవాలు ను స్వీకరిస్తున్నానని… నీ హామీల అమలుపై చర్చకు మోడీ ఎందుకు? అంటూ నిలదీశారు. ఇక్కడ మేము ఉన్నామని… రేవంత్ ఎక్కడ చర్చకు రావాలో చెప్పు అంటూ సవాల్ విసిరారు.
మేము సిద్దంగా ఉన్నామని… నీ ఆరు గ్యారంటీ లే కాదు 420 హామీలపై చర్చిద్దామన్నారు. రేవంత్ ! నీ స్థాయి ఎంత ? అంటూ ఆగ్రహించారు. మహారాష్ట్ర వెళ్లి ప్రధానిపై ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నావు… ప్రజాక్షేత్రంలో ఒకలా . ! ఢిల్లీ వెళ్లి మోడీని కలిసినప్పుడు మరోలా వ్యవహరిస్తున్నావు అంటూ ఫైర్ అయ్యారు. ఈ వర్గాన్ని వదలకుండా అన్ని వర్గాల ప్రజలను రేవంత్ మోసం చేశాడని ఆగ్రహించారు. నాలుగు వేల రూపాయలు నెలనెలా ఇస్తానని చెప్పిన నిరుద్యోగ భృతి ఏమైంది ? అని ప్రశ్నించారు.