వరంగల్ ను మహానగరంగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి పొంగులేటి

-

వరంగల్ ను మహానగరంగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు మంత్రి పొంగులేటి. వరంగల్ లో జరిగిన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకొచ్చిన ధరణీతో ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అందుకే దేశానికి రోల్ మోడల్ అయ్యే రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం పని చేస్తుందని తెలిపారు.

వరంగల్ చుట్టూ ఉన్న ఔటర్ రోడ్డును పూర్తి చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు వరంగల్ కి రూ. 5213 కోట్లు కేటాయించామని తెలిపారు మంత్రి పొంగులేటి. ఇచ్చిన ఆరు గ్యారెంటీలు తప్పకుండా అమలు చేస్తామని తెలిపారు.  ఈ ప్రాంత చిరకాల వాంఛ అయిన మామూనూరు ఎయిర్ పోర్టును అతి త్వరలోనే ఇందిరమ్మ ప్రభుత్వంలో పూర్తి చేయబోతున్నట్టు చెప్పారు. ఈ ఎయిర్ పోర్టు కోసం భూసేకరణ నిమిత్తం రూ.205 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. వరంగల్ అభివృద్ధి కోసం అద్భుతమైన మాస్టర్ ప్లాన్ రూపొందించామని తెలిపారు మంత్రి పొంగులేటి. 

Read more RELATED
Recommended to you

Latest news