ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కృషి చేస్తుంది : బండి సంజయ్

-

నాగాలాండ్ సహా వెనుకబడిన ఈశాన్య రాష్ట్రాలను సమగ్రాభివ్రుద్ది చేసేందుకు నరేంద్రమోదీ ప్రభుత్వం క్రుషి చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా నాగాలాండ్ లో పర్యటిస్తున్న బండి సంజయ్ అందులో భాగంగా ఈరోజు మొకాక్ చుంగ్ జిల్లాలో పర్యటించారు. ఉదయం నాగాలాండ్ రాజధాని కొహిమా నుండి హెలికాప్టర్ లో మొకాక్ చుంగ్ కు చేరుకున్న బండి సంజయ్ జిల్లా డిప్యూటీ కమిషనర్ సువిసీ ఫోజీ ఆధ్వర్యంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

సంపూర్ణతా అభియాన్ లో భాగంగా నీతి అయోగ్ ఎంపిక చేసిన ఆకాంక్షిత జిల్లాల జాబితాలో మోకాక్ చుంగ్ ఒకటి. ఈ నేపథ్యంలో బండి సంజయ్ మాట్లాడుతూ జిల్లాలో కేంద్ర పథకాలు, కార్యక్రమాల అమలులో భాగంగా క్షేత్రస్తాయిలో ఎదురవువుతున్న ఇబ్బందులు, ప్రజల నుండి వస్తున్న ఫీడ్ బ్యాక్ ను అడిగి తెలుసుకున్నారు. జిల్లా సమగ్రాభివ్రుద్ది కోసం కేంద్రం నుండి అందించాల్సిన సహకారంపైనా సూచనలు తీసుకున్నారు. జిల్లాలోని విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుచ్ఛక్తి, సంక్షేమం, రవాణా, జల్ శక్తి రంగాలపై ప్రత్యేకంగా సమీక్షించారు. స్కిల్ డెవలెప్ మెంట్, సంక్షేమ పథకాల అమలుపైనా అధికారుల నుండి పలు వివరాలు సేకరించారు.

Read more RELATED
Recommended to you

Latest news