AR Rahman son Amin reacted to the divorce: తన తల్లిదండ్రుల విడాకులపై స్పందించారు ఏఆర్ రెహమాన్ తనయుడు అమీన్. విడాకులపై స్పందించిన ఏఆర్ రెహమాన్ తనయుడు అమీన్.. ఈ మేరకు ఇన్స్టా లో పోస్ట్ పెట్టాడు. దయతో మనవి చేస్తున్నా… ఈ సమయంలో ప్రతి ఒక్కరూ మా గోప్యతను గౌరవించాలని కోరారు.
మీరు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు అంటూ పేర్కొన్నాడు ఏఆర్ రెహమాన్ తనయుడు అమీన్. కాగా, ఆస్కార్ విజేత అయిన ఏఆర్ రెహమాన్… తన భార్యతో విడిపోతున్నట్లు ప్రకటించారు. తన భార్య సైరా భానుకు విడాకులు ఇస్తున్నట్లు ఏఆర్ రెహమాన్ ప్రకటన చేశారు. మొదటగా ఏఆర్ రెహమాన్ సతీమణి తరఫు న్యాయవాది ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది.