మన శరీరానికి ఖనిజాలు చాలా అవసరం. జీవ క్రియ సరిగా జరగాలన్నా, ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలన్నా, రోగనిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయాలన్నా, ఖనిజాలు కచ్చితంగా కావాలి.
అయితే శరీరంలో ఖనిజాలు లోపిస్తే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఏ ఖనిజం లోపిస్తే ఎలాంటి లక్షణం కనిపిస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.
నోటి పూత:
విటమిన్ బి12, ఐరన్, ఫోలేట్ , జింక్ వంటి ఖనిజాలు లోపించడం వల్ల నోటి పూత వస్తుంది. నోటి పూత రెగ్యులర్గా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే పైన చెప్పిన ఖనిజాలను శరీరానికి అందించండి.
చిగుళ్ల నుండి రక్తం రావడం:
క్యాల్షియం, ఐరన్, జింక్ వంటి ఖనిజాలు.. ఎముకలు, పళ్ళ ఆరోగ్యాన్ని చూసుకుంటాయి. అంతేకాదు.. దవడ ఎముక బలంగా ఉండడానికి కూడా ఈ ఖనిజాలే కారణం. ఇవి లోపించటం వల్ల చిగుళ్ల నుండి రక్తం కారుతుంది.
గోర్లు విరిగిపోవడం:
ఐరన్, విటమిన్ బి7, జింక్, క్యాల్షియం వంటి ఖనిజాలు గోర్లను బలంగా ఉంచడంలో, సరిగ్గా పెరగడంలో సహాయం చేస్తాయి. ఆ ఖనిజాలు లోపించినప్పుడు.. గోర్లు బలహీనంగా మారిపోయి విరిగిపోతుంటాయి.
డిప్రెషన్:
విటమిన్ డి, విటమిన్ బి12, విటమిన్ బి9, ఐరన్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, మెగ్నీషియం వంటి ఖనిజాలు మెదడు పనితీరును చురుకుగా ఉంచుతాయి. ఇవి లోపించినప్పుడు మూడ్ మారిపోయి ఆలోచనలు సరిగ్గా సాగక ఒత్తిడి ఎక్కువై డిప్రెషన్ వస్తుంది.
అలసట:
కొన్నిసార్లు కొంతమంది అసలేమీ చేయకపోయినా కూడా తీవ్రంగా అలసిపోతుంటారు. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు విటమిన్ బి12, ఐరన్, విటమిన్ బి9, మెగ్నీషియం వంటి ఖనిజాలు శరీరంలో లోపించాయేమో చెక్ చేసుకోవాలి. సాధారణంగా అవి లోపించినప్పుడే బాడీ తొందరగా అలసిపోవడం, బలహీనంగా మారిపోవడం జరుగుతుంది.