రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మహిళా అఘోరి.. తిరిగి తిరిగి మళ్లీ తెలంగాణలోని వరంగల్‌కు చేరుకుంది. రాష్ట్రం నుంచి ఆమెను తెలంగాణ పోలీసులు మహరాష్ట్ర బార్డర్లో వదిలేసి వచ్చినా ఏపీలోని ఆలయాలు కవర్ చేస్తూ తిరిగి వరంగల్‌కు చేరుకుంది.ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి అఘోరి శ్మశాన వాటిలో హల్చల్ చేసింది. శవాలను కాల్చిన బూడిద ఒంటికి రాసుకుని ఒంటరిగా పూజలు చేసింది. ఎదురుగా మనిషి పుర్రెలు, చుట్టూ త్రిశూలతో బంధించి కుంకుమ పూజలు చేసిన విజువల్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే శ్మశాన వాటికలో సేద తీరుతున్న అఘోరిని వరంగల్ హిజ్రాలు కలిశారు. పబ్లిక్ ప్రదేశాల్లో ఎందుకు తిరుగుతున్నావని, పర్యటనల పేరుతో ప్రజల్లోకి రావడంతో లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తున్నాయని హిజ్రాల సంఘం నాయకురాలు ప్రశ్నించారు.అఘోరి మానసిక స్థితి తెలుసుకునేందుకు ప్రయత్నించగా..
తాను ఏమీ మాట్లాడలేనని అఘోరి సమాధానం ఇచ్చినట్లు తెలిసింది.
అఘోరితో అర్ధరాత్రి హిజ్రాల భేటీ
స్మశాన వాటికలో సేద తీరుతున్న అఘోరిని కలిసిన వరంగల్ హిజ్రాలు
పబ్లిక్ ప్రదేశాల్లో ఎందుకు తిరుగుతున్నావని, పర్యటనల పేరుతో ప్రజల్లోకి రావడంతో లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తున్నాయని ప్రశ్నించిన హిజ్రాల సంఘం నాయకురాలు
అఘోరి మానసిక స్థితి తెలుసుకునేందుకు… https://t.co/zWFCx6ztje pic.twitter.com/deWyP7OtMJ
— BIG TV Breaking News (@bigtvtelugu) November 20, 2024