రాజమండ్రి రైల్వే‌స్టేషన్లో రైల్వే సిబ్బంది మాక్ డ్రిల్..

-

రాజమండ్రి రైల్వేస్టేషన్లో రైల్వే సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. ఇటీవల రైలు ప్రమాద ఘటనలు తరచుగా జరుగుతున్నందున సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించినట్లు తెలుస్తోంది. రైలు పట్టాలు తప్పిన తర్వాత ప్రమాదం జరిగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.సహాయక చర్యలు ఎలా అందించాలని కళ్ళకు కట్టినట్లు రైల్వే సిబ్బంది, ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది, వైద్య సిబ్బంది ప్రయాణికులకు చూపించారు.

ప్రమాదాలు జరిగిన సమయంలో చాకచక్యంగా వ్యవహరించాలని సూచించారు. ఫస్ట్ ఎయిడ్ ఎలా అందించాలి. వాహన శిథిలాల కింద ఇరుక్కున వారిని రక్షించే విధానంపై రైల్వే,ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది డెమో ఇచ్చారు. వారు చేసిన సహాయక చర్యల డ్రిల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. దీంతో రైల్వే ఉన్నతాధికారులు వారిని అభినందించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news