మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య నివాసానికి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెళ్లారు. బుధవారం రామయ్య పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన చేత సీఎస్ శాంతికుమారి కేక్ కట్ చేయించారు.పుట్టిన రోజు సందర్భంగా పలువురు ప్రముఖులు చుక్కా రామయ్యకు శుభాకాంక్షలు చెప్పారు. ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి సైతం చుక్కారామయ్య నివాసానికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఇదిలాఉండగా, గత కొంత కాలంగా చుక్కా రామయ్య అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. గడిచిన మేలో సీఎం రేవంత్ రెడ్డి సైతం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు.ఆయన కుటుంబ సభ్యులతో అప్యాయంగా మాట్లాడారు.చుక్కా రామయ్యను సత్కరించి జూన్ 2న జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానించారు.