కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పతనం కొడంగల్ నుండే మొదలు పెడతానంటూ శపథం చేశారు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. రైతులకు మద్దతిస్తే నా మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడతారా అంటూ ఆగ్రహించారు. ఇవాళ కొడంగల్ కోర్టు కు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రావడం జరిగింది.
ఈ సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. ఇక అటు పట్నం నరేందర్ రెడ్డిని టెర్రరిస్ట్ లాగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని కోర్టు ప్రశ్నించిందట. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు విధానంపై పోలీసుల మీద మండిపడ్డ తెలంగాణ హైకోర్టు… కేబీఆర్ పార్కు వద్ద వాకింగ్‌కు వెళ్లినప్పుడు మాజీ ఎమ్మెల్యేను ఓ ఉగ్రవాదిలాగా ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందని పోలీసులను నిలదీసినట్లు చెబుతున్నారు.
రేవంత్ రెడ్డి పతనం కొడంగల్ నుండే మొదలు పెడతా
రైతులకు మద్దతిస్తే నా మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడతారా
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు https://t.co/qasrCgriaL pic.twitter.com/1bI4XpWny7
— Telugu Scribe (@TeluguScribe) November 20, 2024