సినిమా ఇండస్ట్రీ ఏదైనా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఒకటి లీకేజీ, రెండు మూవీ రివ్వ్యూలు. ఈ రెండింటి వల్లే సినిమా ఇండస్ట్రీ నష్టాల్లో కూరుకుపోతుందని నిర్మాతల మండలి ఆరోపిస్తున్నది. భారీ బడ్జెట్ చిత్రాలకు పైరసీతో పాటు రివ్య్యూవర్లు ఇచ్చే స్టార్ రేటింగ్ వలన ప్రేక్షకులు సినిమాకు వెళ్లాలా? వద్దా? అని నిర్ణయించుకుంటున్నట్లు తెలిసింది.
ఈ క్రమంలోనే అటువంటి రివ్వ్యూలను దూరం చేసి ఇండస్ట్రీ నష్టపోకుండా ఉండేందుకు తమిళ నిర్మాతల మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక మీదట సినిమా థియేటర్ల వద్ద మైకులు పట్టుకుని ప్రేక్షకుల స్పందనను అడుగడంతో పాటు సొంత ఒపీనియన్‌ను తీసుకోవడాన్ని తమిళ నిర్మాతల మండలి బ్యాన్ విధించింది. ఎవరైనా దీనిని ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.